శృతి హాసన్ పాత్రను భర్తీ చేసేదెవరు ?

Sat,June 3, 2017 04:25 PM
which actress replaced by sruthi

బాహుబలి చిత్రం తర్వాత ఎపిక్ మూవీల హడావిడి పెరిగింది. మహా భారతం, రామాయణం లాంటి చిత్రాలు త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుండగా, సుందర్ సి పలు భాషలలో సంఘమిత్ర అనే టైటిల్ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. ఇటీవల కేన్స్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. జయం రవి, ఆర్య ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ని కూడా మెయిన్ రోల్ కి ఎంపిక చేయగా, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుండి తాను తప్పుకుంటున్నట్టు శృతి ప్రకటించింది.

సంఘమిత్ర చిత్రంలో శృతి పాత్ర యువరాణి కాగా ఈ సినిమా కోసం కత్తి విన్యాసాలు, గుర్రపు స్వారీలు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. అయితే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకోవడంతో ఆ పాత్రని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి యువరాణి పాత్రలో కనిపించాలంటే తప్పక విన్యాసాలు రావలసి ఉంది కాబట్టి గతంలో వాటిపై పట్టు ఉన్న భామలని తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు శిక్షణ ఇప్పించే సమయం కూడా లేకపోవడంతో ఆల్రెడీ ఎక్స్ పీరియెన్స్ ఉన్న అనుష్క, తమన్నా, దీపిక వంటి హీరోయిన్స్ అయితే బాగుంటుందని టీం భావిస్తుందట. మ‌రోవైపు ‘సంఘమిత్ర’ చిత్రంలో నటించాలన్న ఆకాంక్షను నీతు చంద్ర వెల్లడించింది. నర్తకి, వీరనారి సంఘమిత్ర పాత్రలో నటించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. దీంతో శృతి స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు అనే దానిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles