ధోనీ స్టైల్‌లో.. థమన్‌ హెలికాప్టర్‌ షాట్‌: వీడియో

Fri,April 26, 2019 05:26 PM

హైదరాబాద్‌: సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఎస్‌ఎస్‌ థమన్‌. సంగీత దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన మ్యూజిక్‌ అందించారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే థమన్‌.. ఖాళీ సమయం దొరికిందంటే చాలు క్రికెట్‌ ఆడుతుంటాడు. సాంగ్‌ కంపోజింగ్‌ తర్వాత గానీ షూటింగ్‌లో ప్యాక్‌ అప్‌ చెప్పాక.. టీం సభ్యులందరితో కలిసి క్రికెట్‌ ఆడుతుంటాడు. అతను భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి పెద్ద అభిమాని. ప్రతి ఏడాది ధోనీ బర్త్‌డే సందర్భంగా వినూత్నంగా విషెస్‌ కూడా చెబుతుంటాడు. తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో థమన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాడు. అందులో కొన్ని షాట్లు అచ్చం ధోనీలాగానే ఆడాడు. ముఖ్యంగా మహీ స్టైల్‌లో థమన్‌ ఆడిన హెలికాప్టర్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగిన మ్యూజిక్‌ మాంత్రికుడు 34 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. తాజాగా విడుదలైన మజిలీ సినిమాకు మంచి సంగీతం అందించి ప్రశంసలు అందుకుంటున్నారు థమన్‌.










2148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles