విజ‌య్ దేవ‌ర‌కొండ పాడిన సాంగ్ విడుద‌ల‌

Thu,July 26, 2018 12:09 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం గీత గోవిందం. ప‌ర‌శురాంలో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి పెంచుతున్నారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల ఒక సాంగ్‌, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంకేం కావాలి అంటూ గోపీసుంద‌ర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. ఈ సాంగ్ 19 మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ ల‌భించాయి. ఇక టీజ‌ర్ కూడా 5 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి ఔరా అనిపించింది. విజయ్ దేవరకొండకు మార్కెట్ వాల్యూతో పాటు... ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో దీంతో అర్థమైంది. యూత్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ తో వచ్చిన రెస్పాన్స్ తో... చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ రౌడీ ఫ్రస్టేటెడ్ సింగర్ గా మారాడు. స్వయంగా ఈ సినిమా కోసం పాట పాడారు. వాట్ ద ఎఫ్ అంటూ సాగే ఈ పాట కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల కాగా,ఇది సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టించింది. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో రూపొందిన ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 29న గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్నారు.

2577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles