బ‌న్నీ టీంతో క‌లిసిన అలనాటి అందాల తార‌- వీడియో

Wed,July 24, 2019 09:16 AM
Welcome Aboard Tabu Garu  in aa19

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అల‌నాటి అందాల తార ట‌బుని ఎంపిక చేశారు. ఆమె రీసెంట్‌గా టీంతో క‌లిసింది. వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలిపింది చిత్ర బృందం. టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles