ర‌ణ్‌వీర్, దీపికాల వెడ్డింగ్ షెడ్యూల్ ఇదేనా ?

Thu,October 25, 2018 09:14 AM
wedding schedule released

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకుణేల ప్రేమాయ‌ణం గురించి కొన్ని నెల‌ల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇందులో నిజ‌మెంతో తెలియ‌క అభిమానులు జుట్టు పీక్కున్నారు. అయితే నెలల తరబడి సస్పెన్స్‌కు ఇటీవ‌ల‌ తెరదించింది ఈ బాలీవుడ్ జంట . నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు దీపికా, రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. అయితే వీరి వివాహం ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది అనే దానిపై ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ర‌ణ్‌వీర్, దీపికాల వెడ్డింగ్ షెడ్యూల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇట‌లీలోని లేక్ కోమోలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, 200 మంది అతిధుల‌ని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించ‌నున్నార‌ని అంటున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, పార్టీ, డిసెంబర్ 11న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

ఇక పెళ్లి తర్వాత ర‌ణ్‌వీర్, దీపికా కలిసి ఉండబోయే ఇంటిని కూడా ఇప్పటికే ఫైనలైజ్ చేసుకున్నార‌ట . ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా వెన్ను నొప్పి నుండి కోలుకుంటున్న దీపికా త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది.

1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles