అలంకరణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు: కాజల్‌

Sat,June 1, 2019 12:02 PM
we live in a world crazed by physical attraction says kajal Aggarwal

హైదరాబాద్‌: మేకప్‌, అలంకరణ.. బాహ్య ప్రపంచానికి మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు కదా? అని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. మేకప్‌ లేని ఫోటోను కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. నిజమైన అందం అంటే మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం స్వీకరించుకోవడమని పేర్కొంది. మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. సౌందర్య సాధనాల ఉత్పత్తుల కోసం మనం బిలియన్ల కొద్ది రూపాయలను వెచ్చిస్తున్నాం. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని పేర్కొన్నారు.
3146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles