మనం దిగజారిపోయాం.. పద్మావతి వివాదంపై దీపికా

Tue,November 14, 2017 03:01 PM
మనం దిగజారిపోయాం.. పద్మావతి వివాదంపై దీపికా

పద్మావతి మూవీపై నెలకొన్న వివాదంపై స్పందించింది ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన దీపికా పదుకొనె. పద్మావతి విడుదలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేసింది. ఈ యుద్ధంలో సినిమా ఇండస్ట్రీకి విజయాన్ని అందిస్తామని దీపికా చెప్పింది. ఈ మూవీలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ స్టోరీ కచ్చితంగా చెప్పాల్సిందే. అది కూడా ఇప్పుడే అని దీపికా తెలిపింది. డిసెంబర్ 1న మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. రాజ్‌పుత్‌లు మాత్రం అడ్డుకుంటామని శపథం చేస్తున్నారు. కోర్టుల్లో విడుదలను అడ్డుకోవాలని పిటిషన్లు దాఖలవుతున్నాయి. రాణి పద్మిణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమాయణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మూవీకి రాజ్‌పుత్‌లు అడ్డం పడుతున్నారు. అయితే ఇవన్నీ చూస్తుంటే చాలా భయమేస్తుందని దీపికా అంటున్నది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన దేశం ఎక్కడికి వెళ్తున్నది. మనం దిగజారిపోయాం అని దీపికా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇక తాము సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం సెన్సార్ బోర్డుకే అని, మూవీ విడుదలను ఎవరూ అడ్డుకోలేరని దీపికా స్పష్టంచేసింది. పద్మావతి విషయంలో ఇండస్ట్రీ మద్దతు చూస్తుంటే ఇది కేవలం పద్మావతికే పరిమితం కాదు.. ఇంకా పెద్ద యుద్ధమే చేస్తున్నాం అని ఆమె అభిప్రాయపడింది.

1344
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS