ఆడియ‌న్స్ రెస్పాన్స్‌కి ర‌ణ‌వీర్ రియాక్ష‌న్ చూడండి

Sat,December 29, 2018 01:04 PM

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ఎక్క‌డున్నా అక్క‌డ సంద‌డి త‌ప్ప‌క ఉంటుంది. త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేసే ర‌ణ‌వీర్ సింగ్ తాజాగా సింబా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టెంప‌ర్ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అయితే చిత్రంలో ర‌ణ‌వీర్ ఎంట్రీ ఇవ్వ‌గానే ప్రేక్ష‌కులు థియేట‌ర్ హోరెత్తేలా గోల‌చేశారు.దీనికి ర‌ణ‌వీర్ వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి. పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ చిత్రం ఇటు త‌మిళం అటు హిందీలో రీమేక్ కాగా, హిందీలో ‘సింబా’ అనే టైటిల్‌తో విడుద‌లైంది. ఇందులో సోనూసూద్ విలన్‌గా నటించాడు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త‌నిష్క బ‌గ్చీ సంగీతం అందించారు.


2055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles