మెగాస్టార్ పాడిన మ‌రో సాంగ్ విడుద‌ల‌

Thu,May 3, 2018 01:35 PM
Waqt Ne Kiya song from 102 Not Out released

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈయ‌న న‌టుడిగానే కాదు పలు సంద‌ర్భాల‌లో సింగ‌ర్‌గాను అల‌రిస్తుంటారు. ఇటీవ‌ల ఉమేశ్ శుక్లా ద‌ర్శ‌క‌త్వంలో 102 నాటౌట్ అనే చిత్రం చేశారు అమితాబ్‌. ఇందులో రిషి కపూర్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. చిత్రంలో 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. గుజరాతీ రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. మే 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్‌తో పాటు అమితాబ్‌, రిషి కూడా ఈ సినిమాకి భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి వ‌క్త్ నే కియా సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాటకి అమితాబ్ త‌న వాయిస్ అందించారు. ఎస్‌.డీ బుర్మ‌న్ సంగీతంలో రూపొందిన ఈ క్లాసిక‌ల్ కాంగ్ అందరిని అలరిస్తుంది .102 నాటౌట్ చిత్రంలో బ‌డుంబ అనే ఎనర్జిటిక్ సాంగ్‌ని కూడా అమితాబ్ ఆల‌పించ‌డం విశేషం. తాజాగా విడుద‌లైన వ‌క్త్ నే కియా రీమిక్స్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.


3100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles