మ‌హ‌ర్షి మూవీపై లేట్‌గా స్పందించిన వీవీఎస్

Tue,July 23, 2019 08:22 AM
Vvs laxman shares his opinion on maharshi

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రేజీ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ప్రాజెక్ట్ మ‌హ‌ర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం జూన్ 27 తో 50 రోజులు పూర్తి చేసుకుంది. మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రంపై ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ ణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్రంపై పొగ‌డ్తలు కురిపించాడు. మ‌హ‌ర్షి చిత్రం చాలా న‌చ్చింది. ఈ చిత్రం అందించే బ‌ల‌మైన సందేశం మ‌నంద‌రికి చాలా ముఖ్యం. మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌ద‌ర్శ‌న చేశారని ల‌క్ష్మణ్ ట్వీట్ చేశ‌రు. అయితే కొద్ది రోజులుగా వ‌ర‌ల్డ్ క‌ప్ టూర్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ల‌క్ష్మణ్ కాస్త లేటుగా ఈ చిత్రాన్ని వీక్షించిన‌ట్టు తెలుస్తుంది.





1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles