వివి వినాయక్ కొత్త లుక్ చూశారా..?

Mon,July 15, 2019 03:38 PM
VV Vinayak New Look for his debut movie goes viral


ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఇపుడు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. శరభ ఫేం నరసంహారావు డైరెక్షన్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు వినాయక్. ఇప్పటివరకు కాస్త బొద్దుగా కనిపించిన వినాయక్ తన డెబ్యూ చిత్రం కోసం కొత్త లుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

వినాయక్ జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో ఉన్నపుడు తీసిన ఫొటో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వినాయక్ బరువు తగ్గి ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. వివి వినాయక్ ఇప్పటికే ఠాగూర్, ఖైదీ నంబర్ 150, నేనింతే చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించాడు.

2105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles