క్లాసీగా 'ఉన్నది ఒక్కటే జిందగీ' ట్రైలర్

Sat,October 14, 2017 09:33 AM
Vunnadhi Okate Zindagi Theatrical Trailer

ఎనర్జిటిక్ హీరో రామ్ , స్టైలిష్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉన్నది ఒకటే జిందగీ . స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. రీ ఫ్రెషింగ్ గా ఉన్న చిత్ర ట్రైలర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోరు, క్లాసీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ నేపధ్యంలోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. పెళ్ళి చూపులు ఫేం ప్రియదర్శి ఇందులో ముఖ్య పాత్రని పోషించాడు. అక్టోబర్ 27న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

1485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles