ఎన‌ర్జిటిక్ హీరో మూవీ ఫ‌స్ట్ లుక్ అవుట్

Sat,August 5, 2017 12:22 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ త‌న 15వ చిత్రంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. రామ్ త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి బీచ్ సైడ్ షికారు కి వెళుతున్న సీన్ కి సంబంధించిన‌ పిక్ ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ గా విడుద‌ల చేశారు. పెళ్ళి చూపులు ఫేం ప్రియ‌ద‌ర్శి ఫ్రెండ్ గ్రూపులో క‌నిపించ‌గా, ఇది ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ చిత్రంగా ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వ‌ర‌లో చిత్ర ఊటీ షెడ్యూల్ కి వెళ్ల‌నుండగా సెప్టెంబ‌ర్ లో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles