తెలుగు ఆడియ‌న్స్ కి మాస్ ట్రీట్

Thu,July 20, 2017 12:50 PM
Vivekam   Official Telugu Teaser

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి త‌మిళంలోనే కాదు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింప్లిసిటీగా ఉండే త‌ల త‌న సినిమాల‌తో అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాడు. వివేగం అనే మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ తో ఆగ‌స్ట్ 10న థియేట‌ర్స్ లోకి రానున్నాడు. బ‌ల్గేరియా, ఆస్ట్రియా మ‌రియు కురోషియా వంటి ప్రాంతాల‌లో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం కొద్ది పార్ట్ మాత్ర‌మే ఇండియాలో జ‌రుపుకుంది. తెలుగులో ఈ మూవీని వివేకం అనే టైటిల్ తో విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి ఫ్యాన్స్ లో వైబ్రేష‌న్స్ తెచ్చారు. ఇది ఆడియ‌న్స్ కి మాస్ ట్రీట్ అని అంటున్నారు. అభిమానులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఈ సినిమాపై ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. ఇందులో తొలిసారి కాజ‌ల్.. అజిత్ తో జ‌త క‌ట్ట‌గా అక్ష‌ర హాస‌న్ మ‌రియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే పాట‌ల‌పండుగ నిర్వ‌హించి ఆ రోజే మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

1238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles