తమిళ సినీ పరిశ్రమ బంద్ పై వివేక్ స్పందన

Fri,March 16, 2018 06:17 PM
Vivek Reacts To The TFPC Strike issue

డిజిటల్ ప్రొవైడర్లు అడ్డగోలు వసూళ్ళకి పాల్పడుతున్నారని సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోని థియేటర్ యాజమాన్యాలు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆరు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేసి కొన్ని డిమాండ్స్ ఒప్పుకోవడంతో బంద్ విరమించుకున్నారు తెలుగు నిర్మాతలు . కాని తమిళ, కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలను మాత్రమే బంద్ చేయగా, ఇకపై షూటింగ్లు సైతం నిలిపివేయాలని నిర్ణయించారు. మార్చి 16 నుంచి షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిలిపివేయాలని డిసైడ్ అయింది తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.

తమిళ సినీ పరిశ్రమకి సంబంధించిన బంద్ పై నటుడు వివేక్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. పలు సోషల్ ఇష్యూస్ తో పాటు తమిళ నాడులో జరిగే మేజర్ సమస్యలపై గొంతెత్తే వివేక్ ఈ సారి బంద్ గురించి మాట్లాడారు. తమిళ నాడు రాష్ట్రం ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుంది. ఒకటి వ్యవసాయం. రెండు సినిమా. సినిమాలని ప్లానింగ్ లేకుండా రిలీజ్ చేయడం, బంద్ లు, మొదటి రోజు సోషల్ మీడియాలో సినిమా రివ్యూలు పోస్ట్ చేయడం, టిక్కెట్ రేట్స్ భారీగా పెంచడంతో సినిమా అనేది ఓ దిగ్భందంలో కూరుకుపోయింది. సినిమా లేదా వ్యవసాయం కి సంబంధించిన సమస్యలని కేవలం ప్రభుత్వమే సాల్వ్ చేయగలుగుతుందని వివేక్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. వివేక్ కమెడీయన్ గా పలు సినిమాలలో నటించి ఎందరో ఆదరాభిమానం అందుకున్నాడు. సామాజిక సమస్యలపై తరచూ తన వాదనని వినిపిస్తూనే ఉంటాడు వివేక్.


1425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles