పాట‌ల సంద‌డి మొద‌లు పెట్టిన త‌ల‌

Thu,June 15, 2017 12:39 PM
Vivegam  Surviva Song Teaser

తమిళంలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో అజిత్ ఒకడు. తల అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు అజిత్ . ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన లుక్స్, చిత్ర టీజ‌ర్ అభిమానులనే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ముక్కున వేలేసుకునేలా చేసింది. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం వివేగంలో అందాల బామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని సుర్వివా అనే సాంగ్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ఇది ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తుంది. జూన్ 19న ఈ సాంగ్ ఫుల్ ట్రాక్ విడుద‌ల చేయ‌నున్నారు. అంతర్జాతీయ టెర్రర్‌ నెట్‌వర్క్‌ను ఎలా అంతం చేశారన్నదే వివేగం చిత్ర కథ కాగా ఇందులో అక్ష‌ర హాస‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందించాడు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles