అజిత్ ఒంటినిండా ఆ గాయాలేంటి?

Sat,March 18, 2017 09:48 AM
vivegam second look released

తమిళంలో రజినీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో అజిత్ ఒకడు. తల అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అజిత్ శిం దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

వివేగమ్ చిత్రంకు సంబంధించి ఇటీవల అజిత్ లుక్ ఒకటి విడుదల చేసింది టీం. ఈ లుక్ ని చూసి అభిమానులే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ముక్కున వేలేసుకున్నారు. ఈ వయస్సులోను అజిత్ తన ఫిట్ నెస్ తో అందరికి పెద్ద షాకే ఇచ్చాడు. ఇక చిత్ర యూనిట్ తాజాగా మరో లుక్ విడుదల చేసింది. ఇందులో శరీరమంతా కాలిన గాయాలు, రక్తపు చారలు ఉండగా చిరిగిన బట్టలతో కనిపించాడు అజిత్. ఈ స్టిల్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

2523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles