ఆగ‌స్ట్ 10న అజిత్ అభిమానులకు పెద్ద పండుగే..!

Sun,July 2, 2017 09:34 AM
vivegam release date fixed

త‌ల అజిత్ న‌టించిన మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ వివేగం నిన్న‌టితో షూటింగ్ పూర్తి చేసుకుంది. బ‌ల్గేరియా, ఆస్ట్రియా మ‌రియు కురోషియా వంటి ప్రాంతాల‌లో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం కొద్ది పార్ట్ మాత్ర‌మే ఇండియాలో జ‌రుపుకుంది. ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ సెర్బియాలో జ‌రిగింది. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో మేక‌ర్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఆగ‌స్ట్ 10న చిత్రాన్ని థియేట‌ర్స్ లోకి తీసుకు రాబోతున్నారు. కొద్ది రోజులుగా చిత్ర రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల‌కు టీం ప్ర‌క‌ట‌న సంతోషం క‌లుగ‌జేస్తుంది. తొలిసారి కాజ‌ల్.. అజిత్ తో జ‌త క‌ట్ట‌గా ఇందులో అక్ష‌ర హాస‌న్ మ‌రియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే పాట‌ల‌పండుగ నిర్వ‌హించి ఆ రోజే మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles