వైర‌ల్ గా మారిన అజిత్ గ్రూప్ ఫోటో

Fri,June 30, 2017 03:18 PM

త‌ల అజిత్ న‌టిస్తున్న వివేగం చిత్రం ఆగ‌స్ట్ లో థియ‌టర్స్ లోకి వ‌చ్చేందుకు ఉర‌క‌లు పెడుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ మూవీ బ‌ల్గేరియా, ఆస్ట్రియా మ‌రియు కురోషియా వంటి ప్రాంతాల‌లో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోగా, కొద్ది పార్ట్ మాత్ర‌మే ఇండియాలో జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం సెర్బియాలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్ర ద‌ర్శ‌కుడు శివ త‌న ట్విట్ట‌ర్ లో అజిత్ తో క‌లిసి టీం అంద‌రు దిగిన ఫోటోని షేర్ చేసాడు. ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అక్ష‌ర హాస‌న్ మ‌రియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ అందించిన సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పాట‌ల‌తో పాటు ట్రైల‌ర్ ని జూలైలో విడుద‌ల చేయాలని భావిస్తున్నారు. వివేగం చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.2491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles