వివేగం టీజర్ పై సెలబ్రిటీల ప్రశంసల జల్లు

Thu,May 11, 2017 12:09 PM
Vivegam   Official Teaser

అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వివేగం టీజర్ వచ్చేసింది. అభిమానుల అంచనాలను మించి ఈ టీజర్ ని కట్ చేయడంతో సెలబ్రిటీలు కూడా వివేగం టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో టీజర్ ఉందంటూ కొందరు ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు. విడుదలైన కొద్ది గంటలలోనే ఈ టీజర్ రికార్డు వ్యూస్ సాధించి అందరు అవాక్కయ్యేలా చేసింది. టీజర్ అజిత్ లుక్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుందని అంటున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు


1182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles