వైరల్ గా మారిన ‘వివేగం’ లుక్స్

Fri,March 24, 2017 10:30 AM
vivegam looks goes viral

తమిళంలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో అజిత్ ఒకడు. తల అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అజిత్ శివ దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వివేగమ్ చిత్రంకు సంబంధించి ఇటీవల రెండు లుక్స్ ని విడుదల చేసింది టీం. ఈ లుక్ ని చూసి అభిమానులే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ముక్కున వేలేసుకున్నారు. ఇక తాజాగా అజిత్ లుక్ తో పాటు చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబేరాయ్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ రెండు ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి. ట్విట్టర్ లో యాష్ ట్యాగ్ తో వివేగంమానియా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రం యూరప్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

1373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles