బెంచ్ మార్క్ సెట్ చేసిన వివేగం టీజర్

Thu,May 11, 2017 02:08 PM
Vivegam Beats the record of Kabali

తల అజిత్ కి తమిళంలోనే కాదు తెలుగులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో తాజా చిత్రం వివేగం టీజర్ నిన్న సాయంత్రం విడుదలైంది. రిలీజ్ అయిన 12 గంటలలో ఈ చిత్ర టీజర్ కి 5 మిలియన్ల పైనే వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు కబాలి చిత్రంపైనే ఈ రికార్డు ఉంది. తాజాగా వివేగం టీజర్ దీనిని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ మూవీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ప్రస్తుతం వివేగం టీజర్ హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ టీజర్ పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఈ చిత్ర టీజర్ మానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వివేగం చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుందని అంటున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు.

1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles