వైరల్ గా మారిన ‘తల’ లుక్

Fri,April 21, 2017 11:58 AM
Vivegam Ajith Dazzling New Look

తమిళంలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో అజిత్ ఒకడు. తల అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అజిత్ శివ దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ 2న ప్రారంభమైన చిత్ర షూటింగ్ మే 10కి పూర్తి కానుందని అంటున్నారు. వివేగమ్ చిత్రంకు సంబంధించి ఇటీవల రెండు లుక్స్ ని విడుదల చేసింది టీం. ఈ లుక్ ని చూసి అభిమానులే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ముక్కున వేలేసుకున్నారు.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం వివేగంలో అందాల బామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు. ఈయన లుక్ కూడా ఒకటి విడుదలైంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 70 శాతం షూటింగ్‌ యూరప్ లో జరుపుకోగా, మిగిలిన షూటింగ్‌ను ఇండియాలో చిత్రీకరించనున్నారు. అంతర్జాతీయ టెర్రర్‌ నెట్‌వర్క్‌ను ఎలా అంతం చేశారన్నదే వివేగం చిత్ర కథ అని తెలుస్తున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అజిత్ ని చూసి ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. మే 1న అజిత్ బర్త్ డే ఉన్నందున ఆ రోజు కూడా అజిత్ మూవీ పోస్టర్ విడుదల కానుందని అంటున్నారు.

1561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles