డెటాల్ గురించి గొడ‌వ‌.. బాబా త‌ల‌పై గుడ్లు కొట్టిన పున్నుబ్యాచ్

Fri,October 4, 2019 08:16 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌ద‌కొండో వారంలో బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ కొన‌సాగింది. ముందు ఎపిసోడ్‌లో టాస్క్ తొలి లెవ‌ల్ జ‌ర‌గ‌గా అందులో వితికా విజేత‌గా నిలిచింది. గురువారం ఎపిసోడ్‌లో టాస్క్ లెవ‌ల్ 2 జ‌ర‌గ‌గా ఇందులో బిగ్ బాస్ ఒక ఫ్రేమ్‌, ఇటుక ఇచ్చి దానిని కింద ప‌డ‌కుండా బ్యాలెన్స్ చేయ‌మ‌న్నారు. టాస్క్‌లో శివ‌జ్యోతి, శ్రీముఖి, అలీ రెజా, బాబా భాస్క‌ర్ పాల్గొన్నారు. ఎంతో ఓపిక‌గా చివ‌రి వ‌ర‌కు ఇటుకని బ్యాలెన్స్ చేసిన బాబా భాస్క‌ర్ లెవ‌ల్ 2లో విజేత‌గా నిలిచారు. ఈ విజ‌యాన్ని త‌న అభిమానుల‌కి డెడికేట్ చేస్తున్నాన‌ని బాబా అన్నారు.


అయితే ఆడలేక మద్దెలదరువు అన్న‌ట్టు బాబా భాస్క‌ర్ డ్యాన్స్ మాస్ట‌ర్ కాబ‌ట్టి ఆయ‌న బాడీని అడ్జెస్ట్ చేసుకొని గెలిచాడంటూ అలీ.. పున్నుతో చెప్పుకొచ్చాడు. అత‌ని బాబా విజ‌యాన్ని రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌, పున‌ర్న‌వి, వితికా, అలీ ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. కొద్ది సేపు బాబా గురించి చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత బాటిల్ ఆఫ్ మెడాలియన్ ఫైన‌ల్ టాస్క్‌లో పాల్గొన‌మ‌ని బాబా భాస్క‌ర్, వితికాల‌ని ఆదేశించారు బిగ్ బాస్‌. ఫైన‌ల్ టాస్క్‌లో పోటీలో పాల్గొన్న ఇంటి స‌భ్యులు కంటెస్టెంట్‌లని గెలిపించాలంటే వారి నుదుటిపై బొట్టు పెట్టాలి. ఓడించాలి అంటే వారి త‌ల‌పై గుడ్డు కొట్టాల‌ని చెప్పారు.

శ్రీముఖి, మ‌హేష్‌, శివ‌జ్యోతిలు బాబా భాస్క‌ర్‌కి స‌పోర్ట్ చేస్తూ ఆయ‌న‌కి బొట్టు పెట్ట‌గా, పునర్న‌వి గ్యాంగ్ అంతా వితికానే స‌పోర్ట్ చేస్తూ బాబా త‌ల‌పై గుడ్డు కొట్టారు. ఒక్క‌డిని టార్గెట్ చేస్తూ పున్ను గ్యాంగ్ ప్ర‌వ‌ర్తించిన తీరు నెటిజ‌న్స్‌కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే వీటన్నింటిని బాబా భాస్క‌ర్ లైట్ తీసుకున్న‌ట్టు క‌నిపించాడు కాని లోప‌ల మాత్రం చాలా బాధ‌ప‌డ్డాడు. గేమ్ పూర్తైన త‌ర్వాత పున్ను బ్యాచ్ ..బాబా భాస్క‌ర్‌తో కాస్త డిస్క‌ష‌న్ జ‌రిపారు. త‌న ప్ర‌వ‌ర్త‌న‌ని వేరేలా చూడ‌డం వ‌ల‌ననే మీకు త‌ప్పుగా క‌నిపిస్తున్నానేమో అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ హౌజ్‌లో లైట్స్ బంద్ అయిన త‌ర్వాత పున‌ర్న‌వి, రాహుల్‌లు బాబా భాస్క‌ర్ గురించి కొద్ది సేపు ముచ్చ‌టించుకున్నారు. ఆయ‌న నామినేష‌న్‌ని అస్స‌లు తీసుకోలేక‌పోతున్నాడు. అత‌నిని చూస్తే చాలా బాధ అనిపించింద‌ని రాహుల్‌.. పున్నుతో చెప్పుకొచ్చాడు. శ్రీముఖితో ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న బాబా మ‌నకు అలా కనిపిస్తున్నాడేమో అంటూ రాహుల్ అన్నాడు. అయితే ఎపిసోడ్ మొద‌ట్లో రాహుల్‌, పునర్న‌విలు డెటాల్ గురించి కొద్ది సేపు గొడ‌వ‌ప‌డ్డారు.

క్లీనింగ్ బాధ్య‌త‌లు తీసుకున్న రాహుల్ డెటాల్‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాడుతున్నాడ‌ని హౌజ్ కెప్టెన్ అయిన శ్రీముఖికి కంప్లైంట్ చేసింది పునర్న‌వి . అనంత‌రం ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఎందుకు ఇలా వాడుతున్నావు అంటూ చెడామడా క్లాస్ పీకింది. ఇవ‌న్నీ లైట్ తీసుకున్న రాహుల్ ఆమె అంతేలే అని అలీ, వ‌రుణ్‌తో అన్నాడు. డెటాల్ గురించే దాదాపు పావు గంట చ‌ర్చ జ‌ర‌గ‌గా చివరికి దీనికి పులిస్టాప్ పెట్టారు వ‌రుణ్‌, అలీ.

5203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles