సంక్రాంతి పందెం కోళ్ళు వీరేనా ?

Sat,November 24, 2018 02:02 PM
viswasam release for pongal

సంక్రాంతికి టాలీవుడ్‌లో బ‌డా హీరోల సినిమాలు రిలీజ్ కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ సంక్రాంతికి కూడా రామ్ చ‌ర‌ణ్ చిత్రం విన‌య విధేయ రామ అనే చిత్రంతో పాటు ప‌లు సినిమాలు రిలీజ్‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఇక కోలీవుడ్‌లోను సంక్రాంతి బ‌రిలో బ‌డా సినిమాలు నిలిచేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తుంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేట సినిమాతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మవుతుంటే,అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక ఆర్‌జే బాలాజీన‌టించి ఎల్‌కేజీ చిత్రం కూడా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అజిత్ న‌టించిన విశ్వాసం చిత్ర రిలీజ్‌పై గంద‌ర‌గోళం నెల‌కొన‌గా, సంక్రాంతికి ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు. జ‌న‌వ‌రి 10న విశ్వాసం చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. డిసెంబ‌ర్ లో విశ్వాసం టీజ‌ర్‌, ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తానికి ఈ సంకాంత్రి కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌లో స‌రికొత్త ఆనందాన్ని నింప‌డం ఖాయం అని తెలుస్తుంది.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles