200 కోట్ల క్ల‌బ్‌లోకి 'విశ్వాసం'

Wed,March 6, 2019 12:44 PM
viswasam reaches 200 Crs Gross at the WW Box Office

త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంద‌ని తెలుస్తుంది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే ఈ చిత్రం 139 కోట్ల రూపాయ‌లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత త‌మిళ‌నాడులో ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఘ‌న‌త ఈ చిత్రానికి ద‌క్కింది. కోలీవుడ్‌లో జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు 50డేస్ సెల‌బ్రేష‌న్స్‌ని పండుగ‌లా జ‌రుపుకున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లోను డ‌బ్బింగ్ వ‌ర్షెన్ విడుద‌ల కాగా, అక్క‌డ కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. విశ్వాసం చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు. ప్ర‌స్తుతం అజిత్.. బోని క‌పూర్ నిర్మాణంలో పింక్ రీమేక్ చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నెర్కొండ పార్వీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.


2012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles