అజిత్ 'విశ్వాసం' ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్

Mon,December 31, 2018 08:26 AM
Viswasam Official Trailer released

త‌ల అజిత్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అజిత్‌ కి త‌మిళంలోనే కాదు తెలుగులోను ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా అజిత్ న‌టించిన విశ్వాసం చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేస్తున్నాయి. జ‌గ‌ప‌తి బాబు, అజిత్ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇక క‌థానాయికగా న‌టిస్తున్న న‌య‌న‌తార‌తో కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయింద‌నిపిస్తుంది. ఈ ట్రైలర్ లో గంటలో 34లక్షల రియల్ టైం వ్యూస్ ను అలాగే 5లక్షల 73వేల లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగింది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ కోటికి పైగా వ్యూస్ రాబ‌ట్టి హాట్ టాపిక్‌గా మారింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అజిత్‌కి మంచి హిట్ ఇస్తుంద‌ని టీం భావిస్తుంది. గతంలో 'వి' అక్షరంతో తెర‌కెక్కిన‌ అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే .

1655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles