తెలుగులో అల‌రించేందుకు సిద్ధ‌మైన అజిత్‌- ట్రైల‌ర్

Sun,February 24, 2019 07:33 AM

ఇటు తెలుగు, అటు త‌మిళంలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో అజిత్ ఒక‌రు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. జ‌న‌వ‌రి 10న త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో తెలుగులో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాల‌తో పాటు డైలాగ్స్ బాగున్నాయి. జ‌గ‌ప‌తి బాబు, అజిత్ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇక క‌థానాయికగా న‌టిస్తున్న న‌య‌న‌తార‌తో కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయింద‌నిపిస్తుంది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన‌ ఈ చిత్రం తెలుగులో అజిత్‌కి మంచి హిట్ ఇస్తుంద‌ని అంటున్నారు. గతంలో 'వి' అక్షరంతో తెర‌కెక్కిన‌ అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే . శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. అజిత్ ప్ర‌స్తుతం బోని క‌పూర్ నిర్మాణంలో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles