విజువ‌ల్ వండ‌ర్ చిత్రాల‌కి చైనాలో ఎదురు దెబ్బ‌

Sun,September 15, 2019 08:27 AM

భార‌తీయ సినిమాల మార్కెట్ విస్త్రృతంగా పెరిగింది. మ‌న దేశంలోనే కాక విదేశాల‌లోను మ‌న సినిమాల‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌తీయ సినిమాలు విదేశాల‌లో మంచి క‌లెక్ష‌న్స్ ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో మ‌న చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. భజరంగీ భాయ్‌జాన్‌, దంగల్‌, అంధాధూన్‌, సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌, ఇంగ్లిష్‌ మీడియం వంటి బలమైన కథా చిత్రాలు చైనాలో సంచలన వసూళ్లు రాబట్టాయి. తాజాగా ర‌జ‌నీకాంత్, అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 2.0 అనే విజువ‌ల్ వండ‌ర్ చిత్రాన్నిసెప్టెంబ‌ర్ 6న చైనాలో రిలీజ్ చేశారు. తొలి వారం ఈ చిత్రం కేవ‌లం రూ. 22 కోట్ల వ‌సూళ్ళు మాత్ర‌మే సాధించి అంద‌రికి షాకిచ్చింది. గ‌తంలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి కూడా తొలి వారంలో రూ. 52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీని బ‌ట్టి విజువ‌ల్ వండ‌ర్ చిత్రాల‌కి చైనాలో పెద్ద‌గా మార్కెట్ లేద‌నిపిస్తుంది. 2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేశారు. 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుద‌ల కాగా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి.

2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles