మూడు భాష‌ల‌లో విడుద‌ల కానున్న విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్

Sat,June 9, 2018 08:36 AM

కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వ‌రూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది . కొన్నాళ్ళు అటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. యూఎస్ లో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తైన‌ట్టు తెలుస్తుంది. జూలై లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వ‌రూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘ‌ట‌న‌లకి సంబంధించిన సీన్స్ అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తించాయి. ఇండియాలోనే కాదు విదేశాల‌లోను విశ్వ‌రూపం 2 మూవీపై భారీ ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్ర ట్రైల‌ర్ జూన్ 11వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఇక్కడ విశేషమిటంటే.. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ నటుల చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. హిందీ వర్షన్‌లో అమీర్ ఖాన్, తమిళ వర్షన్‌లో శృతి హాసన్, తెలుగు వర్షన్‌లో ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.

3141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles