విశ్వ‌రూపం 2 తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Fri,August 3, 2018 09:40 AM
Vishwaroopam 2 Telugu Trailer released

కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. 2013లో వ‌చ్చిన విశ్వ‌రూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 10న‌ విడుద‌ల కానుంది . తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇండియాలోనే కాదు విదేశాల‌లోను విశ్వ‌రూపం 2 మూవీపై భారీ ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్ర త‌మిళ వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఇక నిన్న సాయంత్రం హైద‌రాబాద్‌లో విశ్వ‌రూపం 2 మూవీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ఆడియో వేడుక నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఆ ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles