విశ్వ‌రూపం 2 మేకింగ్ వీడియో విడుద‌ల‌

Tue,August 7, 2018 08:58 AM
Vishwaroopam 2 Tamil  Making Video

క‌మ‌ల్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం విశ్వ‌రూపం 2. ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానున్న ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తొలి పార్ట్ మంచి విజ‌యం సాధించ‌డంతో రెండో పార్ట్ కూడా త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని అంటున్నారు. విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సాంగ్స్, టీజ‌ర్ , ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూవీ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో క‌మ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఆశ్చర్యాన్ని క‌లిగిస్తున్నాయి. ఇండియాలోనే కాక విదేశాల‌లోను ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొంది. 12 సంవ‌త్స‌రాల‌లోపు వయస్సు ఉన్న వ్య‌క్తులు త‌మ త‌ల్లి దండ్రులతో క‌లిసి సినిమా చూడాల‌ని సెన్సార్ బోర్డ్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విడుద‌లైన మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles