హైద‌రాబాద్‌లో క‌మ‌ల్ మూవీ ఆడియో వేడుక‌

Wed,August 1, 2018 01:15 PM
VISHWAROOPAM 2 audio on august 2

స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భుడు క‌మ‌ల్ హాస‌న్ సినిమాలంటే జ‌నాలలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశవ్యాప్తంగా క‌మ‌ల్ సినిమాల కోసం క‌ళ్ళల‌లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు ఆయ‌న అభిమానులు. క‌మ‌ల్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌రూపం 2 చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఆగ‌స్ట్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్స్, ట్రైల‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా సూప‌ర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మూవీ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. చిత్ర యూనిట్ అంతా ఈ ఆడియో వేడుక‌లో భాగం కానున్న‌ట్టు తెలుస్తుంది. 2013లో వచ్చిన ‘విశ్వ‌రూపం ’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ చిత్రానికి కొనసాగింపుగా విశ్వ‌రూపం 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

2010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles