పాగ‌ల్‌గా ఫ‌ల‌క్‌న‌మా దాస్ హీరో

Wed,August 14, 2019 01:18 PM
Vishwaksen next as Paagal

ఇటీవ‌ల ఫ‌ల‌క్‌న‌మా దాస్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన హీరో విశ్వ‌క్ సేన్ త్వ‌రలో పాగ‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ త‌న బేన‌ర్ లక్కీ మీడియాపై ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. హుషారు సినిమాతో మంచి హిట్ కొట్టిన బెక్కం ఇప్పుడు ఈ చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని భావిస్తున్నారు. క్రేజీ ల‌వ్ స్టోరీగా రూపొంద‌నున్న ఈ చిత్రంతో నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నామ‌ని చిత్ర బృందం పేర్కొంది.

2059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles