అమ‌లాపాల్‌తో పెళ్ళి విష‌యంపై మండిప‌డ్డ హీరో

Wed,November 28, 2018 10:15 AM

ప్ర‌ముఖ న‌టి అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో త‌లెత్తిన విభేదాల వ‌ల‌న ఆయ‌న‌కి విడాకులు ఇచ్చి ఒంట‌రిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు వీడిపోయి దాదాపు ఏడాది అవుతుంది. అయితే సింగిల్‌గా ఉంటున్న అమ‌లాపాల్ త‌మిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే వీరిరివురు వివాహం చేసుకోనున్నార‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ వార్త‌లపై విశాల్ మండిప‌డ్డాడు.


రాక్ష‌స‌న్ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అమ‌లాపాల్, విష్ణు విశాల్ ల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని ఓ వైబ్‌సైట్ తాజాగా ప్ర‌చురించ‌డంతో విష్ణు త‌న ట్విట్ట‌ర్ ద్వారా మండిప‌డ్డాడు. ఇదొక చెత్త వార్త‌. మ‌నం మ‌నుషుల‌మ‌ని మ‌రిచిపోతున్నారు. కొంచెం బాధ్య‌త‌గా ఉండండి. మ‌న‌కు కుటుంబాలు ఉన్నాయి క‌దా. వార్త కావాల‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు రాయ‌కండి అంటూ కామెంట్ పెట్టాడు. త‌మిళ హీరో విష్ణు విశాల్ఇటీవ‌ల త‌న భార్య నుండి విడిపోయిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా క‌న్‌ఫాం చేసిన విష‌యం తెలిసిందే. విడివిడిగా జీవిస్తున్న మేము అధికారికంగా డైవ‌ర్స్ పొందాము అనే విష‌యాన్ని త‌న పోస్ట్‌లో తెలిపారు విష్ణు. త‌మ‌కు ఓ కుమారుడు ఉన్నాడ‌ని తెలిపిన విష్ణు,చిన్నారి భ‌విష్య‌త్ కోసం అన్ని ఏర్పాట్లు చేసామ‌ని అన్నాడు.3561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles