త‌న భార్య నుండి విడిపోయిన విష‌యాన్ని క‌న్‌ఫాం చేసిన హీరో

Wed,November 14, 2018 11:41 AM
Vishnu Vishal and wife Rajini officially divorced

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిల‌వ‌డం లేదు. మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న పెళ్లైన కొన్నేళ్ళ‌కి విడిపోతున్నారు. తాజాగా త‌మిళ హీరో విష్ణు విశాల్ త‌న భార్య నుండి విడిపోయిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా క‌న్‌ఫాం చేశాడు. న‌టుడు న‌ట‌రాజ‌న్ కూతురు ర‌జ‌నీతో 2011లో విష్ణు విశాల్‌కి వివాహం కాగా మ‌నస్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడిపోయారు. ఏడాదిగా విడివిడిగా జీవిస్తున్న మేము అధికారికంగా డైవ‌ర్స్ పొందాము అనే విష‌యాన్ని త‌న పోస్ట్‌లో తెలిపారు విష్ణు. త‌మ‌కు ఓ కుమారుడు ఉన్నాడ‌ని తెలిపిన విష్ణు,చిన్నారి భ‌విష్య‌త్ కోసం అన్ని ఏర్పాట్లు చేసామ‌ని అంటున్నాడు. సంతోషంగా ఉన్న మేము అనివార్య కార‌ణాల వ‌ల‌న విడిపోయాం. స్నేహితులుగా ఉండాల‌ని డిసైడ్ అయ్యాం. ఇరు కుటుంబాల మంచి కోస‌మే మేము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని విష్ణు విశాల్ పేర్కొన్నాడు. ఇటీవల విష్ణువిశాల్‌ నటించిన రాక్షసన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి.


5432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles