మంచు విష్ణు, ప్ర‌గ్యాకి యాక్సిడెంట్ ఎలా జ‌రిగిందంటే ..

Wed,April 25, 2018 08:32 AM
Vishnu Manchu Bike Accident Video in Malaysia

మంచు మోహ‌న్ బాబు వారసుడు విష్ణు.. జి నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఆచారి అమెరికా యాత్ర చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం (ఏప్రిల్ 27) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికి , షూటింగ్‌లో మంచు విష్ణు గాయ‌ప‌డ‌డం వ‌ల‌న కాస్త డిలే అయింది. అయితే చేజ్ సీన్‌లో త‌నతో పాటు వెనుక కూర్చొని ఉన్న ప్ర‌గ్యాకి యాక్సిడెంట్ ఎలా జ‌రిగింద‌నేది వీడియో ద్వారా చూపించాడు మంచు విష్ణు. కొద్ది సేప‌టి క్రితం యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియోని చూసి అభిమానులు షాక్ అయ్యారు. విష్ణు చేతుల‌కి , భుజానికి పెద్ద గాయాలే కాగా, క్రింద ప‌డిన స‌మ‌యంలో త‌ల‌కి హెల్మెట్ కూడా లేదు. కాని అదృష్ట‌వ‌శాత్తు త‌లకి ఎలాంటి గాయం కాక‌పోవ‌డంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు. గ‌త ఏడాది మ‌లేషియాలో బైక్‌పై చేజ్ సీన్ తెర‌కెక్కిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విష‌యం తెలుసుకున్న మోహ‌న్ బాబు వెంట‌నే మలేషియా వెళ్ళి కుమారుడికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ట్విట్ట‌ర్ ద్వారా చెప్పిన సంగ‌తి తెలిసిందే. మంచు విష్ణు త్వ‌ర‌లో ఓట‌ర్ అనే చిత్రంతోను ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.


12175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS