నటుడు విశాల్ ప్రస్తుతం సినిమాలతోనే కాదు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపై పోరాడుతూ బిజీగా ఉన్నాడు. అయితే కొద్ది రోజులుగా విశాల్ తన పెళ్ళి విషయంతో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. విశాల్ వివాహం అనీషా అనే అమ్మాయితో జరగనుందని, హైదరాబాద్‌లో వీరి ఎంగేజ్మెంట్ ఉంటుందని పలు కథనాలు ప్రచురించారు. అంతేకాదు నడిఘర్ సంఘం భవనంలోనే విశాల్ పెళ్ళి చేసుకుంటాడని అన్నారు. ఈ వార్తలపై విశాల్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నా వివాహం గుర్తించి వస్తున్న తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వార్త ప్రచురించేముందు నిజమేంటో తెలుసుకోండి. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్లి గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాను. అప్పటి వరకు తప్పుడు వార్తలని ప్రచారం చేయకండి అని విశాల్ స్పష్టం చేశారు. విశాల్ ప్రస్తుతం తమిళంలో టెంపర్ రీమేక్ చేస్తున్నాడు. ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది.