ర‌జ‌నీ, క‌మ‌ల్‌లు ప‌ని చేస్తే అద్భుతం ఖాయం: విశాల్

Wed,February 27, 2019 11:20 AM
vishal sensational tweet goes viral

త‌మిళనాట ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ మ‌ధ్య కాలంలో వీరిద్ద‌రు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచారు. అయితే క‌మ‌ల్ ఇప్ప‌టికే మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. ఇటీవ‌ల తాను రానున్న లోక్ స‌భ‌లో పోటీ చేయ‌న‌ని చెప్పడంతో పాటు ఏ పార్టీకి స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు ర‌జ‌నీకాంత్‌. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్న తలైవా అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని అన్నాడు. అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో క‌మ‌ల్‌, ర‌జనీకాంత్ క‌లిసి పోటీ చేస్తే బాగుంటుంద‌ని విశాల్ అభిప్రాయ‌ప‌డుతున్నాడు. వారిద్ద‌రు క‌లిసి త‌మిళ‌నాడుకి మంచి జ‌రుగుతుంద‌ని అంటున్నాడు. విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీ స‌ర్‌, క‌మ‌ల్ స‌ర్ క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నా. ఇది న‌డిఘ‌ర్ సంఘం షో కోసం కాదు, ఏదో రిసెప్ష‌న్ కోసం కాదు, మ‌ల్టీ స్టార‌ర్ సినిమా కోసం అంత‌క‌న్నా కాదు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఇద్ద‌రు క‌లిసి పోటి చేస్తే బాగుంటుంది. ఇదే జ‌రిగితే అద్భుతం జ‌ర‌గ‌డం ఖాయం అని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ అన్నారు.



1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles