విశాల్‌కు గాయం .. షూటింగ్‌కు బ్రేక్

Fri,May 27, 2016 12:51 PM
vishal injured at shooting

మాస్ సినిమాలతో ఫుల్ ఎంటర్‌టైన్ చేసే తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం విశాల్ కత్తి సండై అనే మూవీ చేస్తుండగా, సన్నివేశంలో భాగంగా ఫైటర్ విశాల్‌పై అటాక్ చేసే సీన్ ని చిత్రీకరించారు. ఆ సమయంలో అనుకోకుండా విశాల్ భుజానికి గాయమై రక్త స్రావం జరిగిందట. ఇక చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి అతనిని ఆసుపత్రికి వెళ్ళారు. చికిత్స చేసిన వైద్యులు విశాల్‌ని కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. కత్తి సండై చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా విశాల్ సరసన నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. విశాల్ నటించిన 'మరుదు' మూవీ ప్రస్తుతం తమిళ థీయేటర్లలో సందడి చేస్తుండగా, తెలుగులో రాయుడు పేరుతో ఈ రోజు విడుదల అయింది.

2048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles