అమ‌లాపాల్ ధైర్యానికి హ్యాట్సాఫ్‌

Sun,February 4, 2018 12:34 PM
vishal appreciate amala

మ‌ల‌యాళ బ్యూటీ అమ‌లాపాల్ రీసెంట్‌గా అళగేషన్ అనే వ్యాపారవేత్త తనపై లైంగికవేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. వచ్చే నెలలో మలేషియాలో జరుగనున్న ‘డ్యాన్సింగ్‌ తమిళచ్చి’ షో కోసం డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అళగేషన్ (స్కూల్ యజమాని)వేధింపులకు పాల్పడ్డాడని అమలాపాల్ తన ఫిర్యాదులో పేర్కొంది. అళగేషన్‌పై వెస్ట్ మంబాలం పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి..నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి నిందితుడిని ప‌ట్టించినందుకు అమ‌లా పాల్‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. తాజాగా సినీ న‌టుడు విశాల్ ..అమ‌లాపాల్ ధైర్యాన్ని ప్ర‌శంసించారు. రీసెంట్‌గా జ‌రిగిన ఇన్సిడెంట్‌లో నీవు చూపించిన‌ ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్‌ అమలాపాల్‌. లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయించడానికి నిజంగా చాలా తెగింపు, పట్టుదల కావాలి. కేసు నమోదు చేసుకుని, చర్యలు తీసుకున్న పోలీసు శాఖకు నా ధన్యవాదాలు. నేరస్థుడికి సరైన పాఠం చెబుతారని ఆశిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.



2569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles