తెలుగులో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ

Sun,February 10, 2019 08:21 AM

కొలవరి పాటతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ధనుష్ నిర్మించిన చిత్రం విశరనై . ఓ బలమైన కథతో రూపొందిందిన ఈ చిత్రం వెట్రిమారన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. ఆస్కార్ నామినేషన్ కోసం ఫారిన్ ఫిలిమ్ కేటగిరీకి ఎంపిక చేసిన చిత్రాల్లో విశరనై ఒక‌టి. అయితే దురదృష్టవశాత్తు విశరనై సినిమా ఆస్కార్‌కి ఎంపిక కాలేదు. కాని ప‌లు నేష‌న‌ల్ అవార్డ్స్ ద‌క్కించుకుంది. బలమైన కథ, సన్నివేశాలతో పాటు నటీనటుల ప్రతిభ కూడా ఆ సినిమాలో కనబడుతుంది. ఉత్తమ తమిళచిత్రం, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని విచార‌ణ అనే పేరుతో స‌ముద్ర‌ఖ‌ని తెలుగులో విడుద‌ల చేశారు . తెలుగులోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. క‌ల్ప‌న కోనేరు తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ ద‌క్కించుకుంది. లాక్‌ అప్ అనే న‌వ‌ల ఆధారంగా విశ‌ర‌నై చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

4136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles