విరాట్‌, అనుష్కా.. కొత్త లొకేష‌న్‌లో..

Sat,February 2, 2019 09:37 AM
Virat Kohli and Anushka Sharma at an undisclosed location near a lake

హైద‌రాబాద్: క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఆనంద లోకాల్లో విహ‌రిస్తున్నాడు. త‌న భార్య అనుష్కా శ‌ర్మ‌తో .. ప్ర‌కృతి ప్ర‌దేశాల్లో ప‌ర‌వ‌శించిపోతున్నాడు. న్యూజిలాండ్ టూర్ మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఓ అద్భుత లొకేష‌న్‌లో త‌న ల‌క్కీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తాజాగా ఓ ఫోటో అప్‌లోడ్ చేశాడు. ఆ ఫోటోలో ఇద్ద‌రూ ఓ స‌ర‌స్సు ప‌క్క‌న నిల‌బ‌డి ఉన్నారు. హ‌త్తుకుని నిలుచున్న ఆ ఇద్ద‌రూ త‌మ త‌న్మ‌య‌త్వాన్ని ఆ ఫోటోలో వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 2017లో కోహ్లీ, అనుష్కా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా కోహ్లీ పోస్టు చేసిన ఫోటోకు కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌ల లైక్‌లు వ‌చ్చేశాయి. అమితానందానికి శ్వాస దూరంలో ఉన్న‌ట్లు ఇటీవ‌లే అనుష్కా కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది. హాలీడేకు వెళ్తున్న‌ట్లు కూడా కోహ్లీ మ‌రో పోస్టు చేశాడు.

View this post on Instagram

♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on


2884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles