సక్సెస్ మీట్ లో వినాయక్ కి జరిగిన సన్మానం

Sat,January 28, 2017 08:21 AM
vinayak sanmanam at successmeet

సంక్రాంతి బరిలో ఖైదీ నెం 150, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి రెండు పెద్ద సినిమాలతో పోటి పడి మంచి విజయం సాధించిన చిత్రం శతమానం భవతి. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతుంది. ఇప్పటికి ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తోంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ప్రకాశ్ రాజ్, జయసుధ, సీనియర్ నరేష్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తాజగా ఈ చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ‘శతమానం భవతి’ విజయం తన బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తానని చిరు అన్నారు. అంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చిరు పేర్కొన్నారు. ఇంక ఈ కార్యక్రమంలో వివి వినాయక్ ని సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి.

2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles