ఆస్కార్స్‌కు అర్హత సాధించిన అస్సాం సినిమా

Sat,September 22, 2018 11:56 AM
Village Rockstars becomes Indias official entry to Oscars 2019

ముంబై: అస్సామీ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు పోటీపడనున్నది. రిమా దాస్ డైరక్ట్ చేసిన విలేజ్ రాక్‌స్టార్స్ ఫిల్మ్.. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్ పోటీలకు భారత్ తరపున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి 24న అకాడమీ అవార్డుల ప్రదానం ఉంటుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేయడం విశేషం. కన్నడ ప్రొడ్యూసర్ రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డైరక్టర్ రిమా దాస్ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన కథాంశంతో చిత్రాన్ని తీశారు. విలేజ్ రాక్‌స్టార్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. టొరంటోలో జరిగిన వరల్డ్ ప్రీమియర్‌లో ప్రశంసలు అందుకున్నది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ దీన్ని ప్రదర్శించారు. 65వ జాతీయ పురస్కారాల్లోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నది.

1419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS