సెన్సేషన్ సృష్టిస్తున్న 'ఇరు ముగన్' ఫస్ట్ లుక్ పోస్టర్స్..!

Mon,January 11, 2016 12:28 PM
Vikrams Iru Mugan Movie First look

వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న చియాన్ విక్రం కొత్త సినిమా 'ఇరు ముగన్' ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో నిర్మాణమవుతున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌తో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. సగం యంత్రం, సగం మనిషిగా వినూత్న రీతిలో విక్రం ఈ పోస్టర్లలో సినీ అభిమానులకు కనిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిని గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టర్‌ను ఆ చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

'ఇరు ముగన్‌'లో నయనతార, నిత్య మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా ఆనంద్ శంకర్ దీనికి రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కాగా తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో విక్రం దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించాలని ఆయన చూస్తున్నారు. ఎప్పుడో ప్రారంభం కావల్సిన ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చి ఈ మధ్యే డిసెంబర్‌లో షురూ అయింది. దీంతో విక్రం మరోసారి తనదైన నటనతో సినీ అభిమానులను పూర్తి స్థాయిలో అలరిస్తారని ఆ సినీ యూనిట్ గట్టి నమ్మకంగా చెబుతోంది.

3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles