అఫీషియల్: విక్రమ్ తో కమల్ సినిమా

Sat,January 20, 2018 02:51 PM
vikram next with kamal

లోక నాయకుడు కమల్ హాసన్, వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించే విక్రమ్. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. విక్రమ్ హీరోగా రూపొందనున్న సినిమాకి కమల్ నిర్మాతగా మాత్రమే ఉంటాడట. కమల్ సొంత బేనర్ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బేనర్ పై ఈ చిత్రం నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా తన రెండో కూతురు అక్షర హాసన్ ని ఎంచుకున్నాడు కమల్. రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కమల్ తో ఈయన చీకటి రాజ్యం సినిమా తీసిన సంగతి తెలిసిందే. చీకటి రాజ్యం తరహాలోనే విక్రమ్ సినిమా కూడా థ్రిల్లర్ మూవీగా ఉంటుందని సమాచారం. ఫ్రెంచ్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు టాక్ . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో విక్రమ్ నటిస్తుండగా, ఇది పూర్తి కాగానే కమల్ ప్రాజెక్టులోకి వస్తాడు విక్రమ్. మరోవైపు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు విశ్వరూపం 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో ఈ మూవీని థియేటర్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.



1005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles