నిశ్చితార్ధం ఉంగరం పోగొట్టుకున్న హీరో కూతురు

Wed,August 3, 2016 11:47 AM

తమిళ నటుడు విక్రమ్ కూతురు అక్షితకు ఈ మధ్య నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. డిఎంకే అథ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌తో అక్షిత ఎంగేమెంట్ కాగా వీరి వివాహం 2017లో జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే తాజాగా అనుకోని ఓ సంఘటన అక్షితను షాక్‌కి గురి చేసింది. ఇటీవల ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులోని ఓ ఐస్ క్రీం పార్లర్‌కు వెళ్ళిన అక్షిత తిరిగి వెళుతుండగా తన చేతికి ఉంగరం లేదని గ్రహించింది. ఆ ఉంగరం విలువ దాదాపు 12 లక్షలు ఉంటుందట. ఈ నేపధ్యంలో అక్షిత, విక్రమ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

3525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles