తమిళ హీరో విక్రమ్ ఇంట నిశ్చితార్ధ వేడుక..!

Mon,June 27, 2016 09:57 AM

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ విక్రమ్. తన నటనతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ఈ స్టార్ హీరో. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలు అభిమానులను సంభ్రమాశ్యర్యాలకు గురి చేస్తున్నాయి. విక్రమ్ ఇంట త్వరలో ఓ శుభకార్యం జరగనుందని టాక్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయ అక్షితకు నిశ్చితార్ధం ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. త్వరలోనే డీఎంకే నేత కరుణానిధి కొడుకు ముత్తు మనవడు మను రంజిత్‌తో అక్షిత వివాహం జరగనున్నట్టు సమాచారం. జూలై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో నిశ్చితార్ధం ప్లాన్ చేసిన విక్రమ్, మ్యారేజ్‌ని వచ్చే ఏడాది జరపాలని సన్నాహలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే , తన కూతురి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను చకాచకా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.

5228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles