విక్రమ్ కూతురి ఎంగేజ్ మెంట్ రింగ్ దొరికింది

Tue,August 16, 2016 08:36 AM

తమిళ నటుడు విక్రమ్ కూతురు అక్షితకు ఈ మధ్య నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. డిఎంకే అథ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌తో అక్షిత ఎంగేమెంట్ కాగా వీరి వివాహం 2017లో జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే ఎంగేజ్ మెంట్ అయిన కొన్ని రోజులకే అనుకోని ఓ సంఘటన అక్షితను షాక్‌కి గురి చేసింది. ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులోని ఓ ఐస్ క్రీం పార్లర్‌కు వెళ్ళిన అక్షిత తిరిగి వెళుతుండగా తన చేతికి ఉంగరం లేదని గ్రహించింది. ఆ ఉంగరం విలువ దాదాపు 12 లక్షలు ఉంటుందట. ఈ నేపధ్యంలో అక్షిత, విక్రమ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఆ ఉంగరం జాడ దొరకలేదు. అయితే లక్ష్మణన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ కి ఆ ఉంగరం దొరకగా, వార్తా పత్రికల ద్వారా ఆ ఉంగరం విక్రమ్ కూతురి ఎంగేజ్ మెంట్ రింగ్ అని తెలుసుకొని వెంటనే ఆ వ్యక్తి విక్రమ్ ఫ్యామిలీకి అందజేసినట్లు సమాచారం.

2797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles